: ప్రభువుపై భారం వేసి శవం ముందు ప్రార్థనలు చేశారు!


మూఢనమ్మకాలు మనిషిని ఎలా మార్చేస్తాయో చూడండి! విజయవాడలోని విజయ టాకీస్ వద్ద ఓ కుటుంబం శవాన్ని నట్టింట్లో పెట్టుకుని వారం రోజులపాటు ప్రార్థనలు చేసిన వైనం భీతిగొలుపుతోంది. ప్రభువుపై భారం వేసి వారు ఈ చర్యకు ఒడిగట్టారు. ప్రభువే తమ కుటుంబ సభ్యుణ్ణి బతికిస్తారంటూ వారు అందరికి చెబుతూ, వారం రోజులు శవాన్ని అలాగే ఉంచారు. దీంతో, తీవ్రమైన దుర్వాసన రావడంతో, భరించలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆ శవాన్ని అంతిమ సంస్కారాలకు తరలించారు.

  • Loading...

More Telugu News