: 30వ రోజు కూడా కొనసాగుతున్న అనంతపురం బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో 30వ రోజు కూడా ప్రభుత్వ, ప్రైవేటు, వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. సమైక్యవాదుల నిరసనలతో జిల్లా హోరెత్తుతోంది. జిల్లాలోని 980 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమ్మె కారణంగా విద్యాసంస్థలు, బ్యాంకులు, దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించినా అధ్యాపకులు సహకరించకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. వీధుల్లో పోలీసు పహారా కొనసాగుతున్నా.. ప్రజలు ర్యాలీలు, రిలే దీక్షల్లో పాల్గొంటూ సమైక్య ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు.