: నటుడు ఓంపురికి తాత్కాలిక ఊరట


బాలీవుడ్ నటుడు ఓంపురికి 'గృహ హింస' కేసులో తాత్కాలిక ఊరట లభించింది. అదీ ఈ నెల 30 వరకు మాత్రమే.. అంటే నేడు, రేపటి వరకే. తన భర్త తనను దారుణంగా హింసిస్తున్నాడంటూ ఓంపురి రెండవ భార్య నందిత కొన్ని రోజుల కిందట ముంబయిలోని బాంద్రా సబర్బన్ వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల కిందట అతడి ఇంటికి వెళ్లడంతో ఓంపురి కనిపించలేదు. అప్పటి నుంచి పరారీలో ఉన్నట్టుగానే భావిస్తున్నారు. దాంతో, బయటికి వచ్చిన అతడు యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేయకుండా ఈ రెండు రోజులు న్యాయస్థానం తాత్కాలిక రక్షణ కల్పించింది. బెయిల్ పిటిషన్ ను రేపు పరిశీలించనుంది. అప్పటివరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సహకరించాలని ఓంపురిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News