: ఆశారాం బాపు తప్పు చేశాడు, ఆధారాలున్నాయి: పోలీసులు
తాను తప్పు చేశానని నిరూపిస్తే ఐదు లక్షల రూపాయలిస్తానని ప్రకటించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపు సచ్ఛీలుడేం కాదని అంటున్నారు రాజస్థాన్ పోలీసులు. ఆయన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని వారు తెలిపారు. జోధ్ పూర్ డీసీపీ అజయ్ పాల్ లాంబా మీడియాతో మాట్లాడుతూ, తమ బృందాలు షాజహాన్ పూర్, అహ్మాదాబాద్, ఇండోర్ లో ఉన్న బాపు ఆశ్రమాలకు వెళ్ళి తగిన ఆధారాలు సంపాదించాయని వెల్లడించారు. కాగా, పోలీసులు బాపును శుక్రవారం ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఆయనకు సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే.