: రోజురోజుకీ పెరుగుతున్న హెచ్ పీసీఎల్ మృతులు
విశాఖలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీ పేలుడులో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న కార్మికులలో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరుకుంది. నాటి ప్రమాదంలో 30 మంది వరకూ తీవ్ర కాలిన గాయాలతో విశాఖపట్నంలోని న్యూకేర్, మణిపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మరికొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.