: హైదరాబాద్ లో సభలు, ర్యాలీలపై నిషేధం
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వచ్చే నెల 4 వరకు ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈరోజు వరకు ఉన్న నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. సచివాలయం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ట్యాంక్ బండ్, అసెంబ్లీ తదితర ప్రాంతాలలో ఈ నిషేధం అమలవుతుందని తెలిపారు.