: కృత్రిమ మెదడును తయారు చేయవచ్చు!


శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ మనిషి అవయవాల్లో పలు అవయవాలను మూలకణాలతో కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. అయితే మెదడును మాత్రం తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా శాస్త్రవేత్తలు విజయాన్ని సాధించారు. మనిషి మెదడు కణజాలాన్ని కృత్రిమంగా తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

శాస్త్రవేత్తలు మూలకణాల సాయంతో మనిషి మెదడు కణజాలాన్ని సృష్టించామని ప్రకటించారు. బఠాణీ గింజలంత పరిమాణంలో ఉండే మెదడు కణజాలాన్ని మూలకణాల సాయంతో ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ కృత్రిమ మెదడు, మెదడుకు సంబంధించిన సమస్యలను గురించి అధ్యయనం చేయడానికి, అత్యంత సంక్లిష్టమైన మెదడు తొలిదశ అభివృద్ధిని గురించి అర్ధం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కృత్రిమ మెదడు కణజాలాన్ని 'సెరిబ్రల్‌ ఆర్గానాయిడ్స్‌'గా శాస్త్రవేత్తలు వర్ణించారు. ఈ కణజాలాలు ఇకపై శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలకు ఎలుక మెదళ్లపై ఆధారపడడాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News