: పరీక్ష రాసిన వారంతా ఫెయిలే!


అదొక విశ్వవిద్యాలయం... అందులో ప్రవేశానికి ఒక పరీక్షను నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేకపోయారు... దీంతో అందరూ ఆశ్యర్యపోయారు... ఎవరూ ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఇక ఒక ఏడాదికి సదరు తరగతుల్లో అసలు విద్యార్ధులే ఉండరు. సాధారణంగా మన ప్రాంతాల్లో పిల్ల జనాభా లేకపోవడం వల్ల కొన్ని పాఠశాలల్లో ఒక్కో తరగతికి అసలు విద్యార్ధులే ఉండరు... అయితే ఒక పెద్ద విశ్వవిద్యాలయానికి ఒక ఏడాదికి పిల్లలు లేకపోవడం అనేది కేవలం పరీక్షలో ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేకపోవడం వల్లనే అంటే వినడానికే కాస్త హాస్యాస్పదంగా ఉంది కదూ...!

పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో దేశ రాజధాని మోనోరోవియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లైబీరియా అనే విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు పాతిక వేలమందిదాకా హాజరయ్యారు. అయితే విచిత్రమేమంటే ఒక్కరు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ప్రవేశ పరీక్షను పాతిక వేలమంది రాశారని, అయితే ఒక్కరు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయారని సదరు విశ్వవిద్యాలయం ప్రకటించింది. చివరికి ఒక ఏడాది పలు తరగతులకు విద్యార్ధులు లేకుండా పోతారు కాబట్టి, చేసేదిలేక ఈ పాతికవేలమందిలో నుండే ఒక వెయ్యి మందిని యూనివర్సిటీలో చేర్చుకుంది. వచ్చే నెల నుండి ఈ కొత్త విద్యార్ధులకు తరగతులు మొదలుకానున్నాయి. ఇలా ఒక్క విద్యార్ధి కూడా ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోవడం అనేది లైబీరియా చరిత్రలో ఇదే ప్రథమమని, అధ్యాపకులు సరిగ్గా పాఠాలు చెప్పకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పార్లమెంటు విద్యాకమిటీ ఛైర్మన్‌ బిల్‌ టుయావే విలేఖరులతో అన్నారు.

  • Loading...

More Telugu News