: ట్విట్టర్ వ్యాఖ్యతో వివాదంలో చేతన్ భగత్
ప్రముఖ యువ రచయిత చేతన్ భగత్ రూపాయి పతనంపై ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య పెను దుమారాన్ని రేపింది. దీంతో ఆయన తన వ్యాఖ్యలను ట్విట్టర్ నుంచి తొలగించారు. రూపాయి పతనంపై వ్యాఖ్యానిస్తూ.. 'నాపై అత్యాచారం చేసిన వారిపై శిక్ష లేదా?' అని రూపాయి అడుగుతోందని వ్యాఖ్యానించారు. దీంతో అతనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన నేరాన్ని ఇలా పోల్చి హాస్యంగా కొట్టి వేయడం అమానవీయ చర్య అని దుమ్మెత్తి పోశారు. దాంతో చేతన్ భగత్ పొరపాటును అంగీకరించారు. ఆర్ధిక అంశాల్లో సంక్షోభాలు తరచూ జరిగేవేనని, అత్యాచారం అత్యంత హేయమైన నేరమని పేర్కొన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను ట్విట్టర్ నుంచి తొలగించారు. చేతన్ భగత్ గతంలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పని చేశారు.