: టీవీ నటిపై దాడి.. చోద్యం చూసిన ముంబయి వాసులు
ముంబయిలో ఓ టీవీ నటిపై ముగ్గరు దొంగలు దాడి చేస్తుంటే రక్షించాల్సింది పోయి, చోద్యం చూస్తూ నిల్చుండిపోయారు అక్కడి వాళ్ళు. ముంబయిలో లవ్ లీన్ కౌర్ (20) బాగా ప్రజాదరణ ఉన్న టీవీ నటి. ఆమె ఓ ఆటోలో ప్రయాణిస్తుండగా ఓ దొంగ ఆమె పర్సు లాక్కుని ఉడాయించాడు. వెంటనే ఆటో నుంచి దూకి ఆమె వాడి వెంట పరిగెత్తింది. అయితే, కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ దొంగకు మరో ఇద్దరు తోడు దొంగలు కలిశారు. ఆ ముగ్గురూ కలిసి లవ్ లీన్ కౌర్ ను చుట్టుముట్టి దాడికి దిగారు. అక్కడివాళ్ళు ఏదో జరుగుతోందని చూస్తూ నిల్చుండిపోయారే తప్ప, కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. సమీపంలో ఉన్న పోలీసులు ఆమె అరుపులు విని అక్కడికి చేరుకుని ఇద్దరు దొంగలను పట్టుకోగా, ఒకడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.