: సభ పెడితే చూస్తూ ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్


ఏపీఎన్జీవోలపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని గౌడ్ ఆరోపించారు. హైదరాబాదులో సమైక్య సభ పెడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సభ నిర్వహిస్తే తదనంతర పర్యవసానాలకు సర్కారే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో ఈ మధ్యాహ్నం అశోక్ బాబు మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న హైదరాబాదులో సభ జరిపి తీరుతామని ధీమాగా చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News