: దీక్ష చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి విషమం
విజయనగరం జిల్లా ఎస్ కోటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు ఉద్యోగుల పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినప్పటి నుంచి నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.