: వచ్చే నెలలో ప్రధాని గల్ఫ్ పర్యటన
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెలలో యూఏఈ లో పర్యటించనున్నారు. 32 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గల్ప్ దేశాల్లో పర్యటించనుండడం ఇదే ప్రథమం. చివరిగా 1981లో ఇందిరా గాంధీ గల్ఫ్ దేశాల్లో పర్యటించారు.
కాగా, మన్మోహన్ యూఏఈ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక పెట్టుబడులపై చర్చించనున్నారు. అదే సమయంలో వివిధ ఒప్పందాలపై ప్రధాని సంతకాలు చేసే అవకాశం ఉంది. అనంతరం మన్మోహన్ బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు డర్బన్ వెళతారు. ఈ సమావేశం మార్చి చివరి వారంలో జరగనుంది.