: తిరుపతి అష్ట దిగ్బంధనం


సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతి అష్ట దిగ్బంధనం కొనసాగుతోంది. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బస్సులు, ట్యాక్సీలు, లారీలు రోడ్డెక్కలేదు. దీంతో, జనజీవనం స్తంభించిపోయింది. ఇక తిరుమల వెళ్ళే భక్తుల కోసం అలిపిరి నుంచి కొండపైకి పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పుతున్నా ఫలితం కనిపించలేదు. భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. వారికోసం టీటీడీ రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు 10 ఉచిత బస్సు సర్వీసులను నడుపుతోంది. కాగా, ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన ఈ అష్టదిగ్బంధనం రేపటితో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News