: అందుకే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయలేకపోతున్నారు: రాఘవులు
సరిగ్గా పదమూడేళ్ల క్రితం విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తొమ్మిది వామపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన అమరవీరులకు వామపక్ష నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు జంకుతున్నాయని అన్నారు. ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు నిర్వహించిన ఆనాటి ఉద్యమం.. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ, బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని బలంగా అడ్డుకుందని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసే ధైర్యంలేని ప్రభుత్వం.. ప్రాంతాలు, సెక్టార్లవారీగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాఘవులు దుయ్యబట్టారు.