: కాంగ్రెస్ దర్శకత్వంలోనే వైఎస్సార్సీపీ దీక్ష: యనమల
వైఎస్సార్సీపీ దీక్షలన్నీ కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలోనే జరుగుతున్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని, రాష్ట్రపతికి వైఎస్సార్సీపీ ఇచ్చిందని చెబుతున్న లేఖలకు, సాక్షిలో వస్తున్న కథనాలకు పొంతన లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, లోపాయకారీ ఒప్పందానికి వెళ్లిన ఆ పార్టీ నేతలు బయటికొచ్చాక కొత్త వాదనలు చేస్తున్నారని అన్నారు. కనీసం వారంటున్న సమన్యాయానికి అర్ధం తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. వారి దీక్షల కథ అంతా కాంగ్రెస్ దిశానిర్ధేశంలో నడుస్తుందని మండిపడ్డారు.