: ఇంటర్నెట్ ద్వారా ఎదుటి వారి మెదడు స్వాధీనం


ఇంటర్నెట్ ద్వారా మెయిల్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ చాట్ చేసుకోవచ్చు. అవతలి వారితో మాట్లాడవచ్చు. వారిని కంప్యూటర్లోంచే చూస్తూ వీడియోచాట్ చేయవచ్చు. కానీ, ఆల్ లైన్లో అవతలి వారి మెదడుని నియంత్రిస్తూ, వారికి తెలియకుండానే వారితో పనులు చేయించడం సాధ్యమా? కుదరని పని, అసాధ్యం అంటున్నారా? కానీ సాధ్యం.. ముమ్మాటికీ సాధ్యమేనని నిరూపించారు శాస్త్రవేత్తలు.

ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఉన్న వ్యక్తుల మెదళ్ళను, వారి చర్యలను నియంత్రించే అద్భుత పరిశోధనలో ఆ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ పరిశోధనా బృందంలో భారతీయుడు కూడా ఉండడం మనకు గర్వకారణం. వాషింగ్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాజేష్ రావు సహా మరికొందరు ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించారు. ప్రపంచంలో ఇలాంటి పరీక్ష ఇదే ప్రథమం. వాషింగ్టన్ యూనివర్సిటీలో బ్రెయిన్ సైన్స్ లెర్నింగ్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న స్టోకో ఒక కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అతడి మెదడుకి ఒక స్విమ్ క్యాప్ తగిలించారు. ఇందులోంచి అయస్కాంత తరంగాలు విడుదలయ్యే ఏర్పాటు ఉంది. ఇవి అతడి మెదడులో అన్ని అవయవాల చర్యలను నియంత్రించే కార్టెక్స్ కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.

మరో కంప్యూటర్ ముందు రాజేష్ కూర్చున్నాడు. ఆయన కూడా ఒక క్యాప్ తగిలించుకున్నాడు. ఇందులో రాజేష్ మెదడులోని చర్యలను గుర్తించే మెషిన్ ఉంది. ఇప్పుడు బృందంలోని శాస్త్రవేత్తలు ఇద్దరి మెదళ్లకు ఇంటర్నెట్ ద్వారా లైన్ కలిపారు. రాజేష్ కంప్యూటర్ ముందు కూర్చుని వీడియోగేమ్ ఆడుతున్నాడు. గేమ్ కోసం చేతి వేళ్లను కదిలిస్తూ ఉన్నాడు. చిత్రమేమిటంటే కంప్యూటర్ వైపు చూడకపోయినా, స్టోకో చేతి వేళ్లు అతడికి తెలియకుండానే కీబోర్డుపై కదలాడుతున్నాయి. అంటే రావు మెదడు తరంగాలకు స్టోకో లొంగిపోయాడు. ఇంటర్నెట్ అనేది ఇప్పటి వరకూ కంప్యూటర్లను అనుసంధానించేదని, ఇప్పుడు తమ ప్రయోగం ద్వారా మెదళ్ల అనుసంధానం కూడా సాధ్యమేనని స్పష్టమైందని స్టోకో గర్వంగా చెప్పారు.

  • Loading...

More Telugu News