: దీక్ష విరమించిన భీమిలి ఎమ్మెల్యే
సమైక్యాంధ్రకు మద్దతుగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షను ఈ రోజు విరమించారు. అయితే తాను దీక్ష విరమించినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజన చేయడం సరికాదని కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి న్యాయం చేస్తున్నామని చెప్పి మరోకరికి అన్యాయం చేయడాన్ని అవంతి శ్రీనివాస్ తప్పుపట్టారు. కాగా, శ్రీనివాస్ కు నిన్న రాత్రి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.