: సమైక్యంగా ఉంచాలని మొయిలీని కోరిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీని కలిశారు. హస్తినలో ఆంటోనీ కమిటీని కలిసేందుకు వెళ్లిన సీమాంధ్ర నేతలు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి.. మొయిలీని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు పునఃపరిశీలించేందుకు ఎప్పుడూ అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం ముక్కలు కావడాన్ని ఎవరూ హర్షించడం లేదని చెప్పామని వారు మీడియా ఎదుట వెల్లడించారు. రాయల తెలంగాణపై తామేమీ అడగలేదన్నారు. అన్ని పార్టీలు అంగీకరించిన తరువాత ఇంత ఉద్యమం ఎలా వచ్చిందని మొయిలీ అడిగారని వారు తెలిపారు.