: ఫైటర్ ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్


టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ తెరపైనే కాదు సెట్స్ పైనా హీరో అనిపించుకున్నాడు. 'జంజీర్' షూటింగ్ లో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఓ స్టంట్ మేన్ ను చరణ్ ప్రాణాపాయం నుంచి తప్పించాడు. హీరోను కొందరు గూండాలు చేజ్ చేసే సన్నివేశం షూట్ చేస్తుండగా.. చరణ్ కారు నుంచి ఓ స్టంట్ మేన్ పట్టుతప్పి జారిపోయాడు. ఆ ప్రాంతంలో దుమ్ము పెద్ద ఎత్తున రేగడంతో యూనిట్ సిబ్బందికి కారు వద్ద ఏం జరిగిందో కనిపించలేదు. అయితే, ఫైటర్ మిస్సవడాన్ని గమనించిన రామ్ చరణ్ సెకన్ల లిప్తపాటులో కారుకు బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కారును అలానే ముందుకు ఉరికించి ఉంటే ఆ స్టంట్ మేన్ కు తీవ్ర ప్రమాదం వాటిల్లేదని, కానీ, చరణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, అతడి ప్రాణాలు కాపాడాడని యూనిట్ సిబ్బంది కొనియాడారు.

  • Loading...

More Telugu News