: 29వ రోజు విధులు బహిష్కరించిన సచివాలయ ఉద్యోగులు


సచివాలయంలో ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఇవాళ కూడా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అందుకు ప్రతిగా తెలంగాణ ఉద్యోగులు కూడా నిరసన చేపట్టారు. దీంతో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ నిరసనలు, నినాదాలతో సచివాలయ ప్రాంగణం మార్మోగిపోయింది. సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు నేటితో 29వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎన్ని రోజులైనా ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉద్యోగులు నినదిస్తున్నారు.

  • Loading...

More Telugu News