: సుష్మా స్వరాజ్ ను కలిసిన ఏపీఎన్జీవో నేతలు


బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మస్వరాజ్ ను ఏపీఎన్జీవో నేతలు కలిశారు. పార్లమెంటులో తెలంగాణకు మద్దతిస్తున్నామంటూ సుష్మా పలు సందర్భాల్లో విస్పష్ట వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, వారు రాష్ట్ర పరిస్థితిపై సమగ్రంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అప్పటి పరిస్థితులు, స్థితిగతులు, ఇప్పుడు తెలంగాణలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి వంటి విషయాలన్నీ విడమర్చారు. రాష్ట్ర విభజన వల్ల భావి తరాలకు జరిగే అన్యాయాన్ని విపులీకరించి, పలు కమిటీలు ఇచ్చిన నివేదికలను అందజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని వారు సుష్మాస్వరాజ్ ను కోరారు.

  • Loading...

More Telugu News