: సెప్టెంబర్ 1 న సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా
సెప్టెంబర్ 1 న సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు శాసనసభలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్టు ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు.