: వడోదరలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం


వడోదరలోని మాధవన్ నగర్ ఏరియాలో మూడంతస్థుల భవనం ఈ తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. భవనంలో నివసిస్తున్న వారంతా గాఢనిద్రలో ఉండగా తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనంలో 14 కుటుంబాలు నివాసముంటున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఎస్ఎస్ జి ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. వడోదర మున్సిపల్ ఉన్నతాధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News