: దారుణంగా పడిపోయిన రూపాయి
రూపాయి ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో రక్తమోడుతోంది! డాలర్ తో మారకం విలువ మరింతగా పతనమై 68.02కు చేరింది. మంగళవారం 66.24 వద్ద ఇది క్లోజవగా.. ఈ రోజు 67.06 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. మరింతగా క్షీణించి 68.02కు చేరి మరో చారిత్రక కనిష్టస్థాయికి చేరింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రూపాయి 59 స్థాయి నుంచి 68కి దిగజారడం గమనించాల్సిన విషయం.