: సెప్టెంబర్ 1 నుంచి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర
చంద్రబాబు రథం మళ్లీ కదలనుంది. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఆయన బస్సులో ప్రజల ముంగిటకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేపడతారు. దాచేపల్లి మండలం పొందుగల నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని టీడీపీ గుంటూరు జిల్లా నేతలు ప్రకటించారు. విజయనగరం జిల్లాలో ప్రారంభించాలని ముందుగా అనుకున్నా, అనూహ్యంగా యాత్రను గుంటూరుకు మార్చారు.