: తొలిసారిగా జరిగిన వ్యాపారం ఏదంటే...


రాతియుగ కాలంలో మానవుడు వ్యాపార వాణిజ్యాలు సాగించాడట. అది కూడా ఎలాంటి వస్తువుతో తెలుసా... పంది మాంసంతో. శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐరోపాలో రాతియుగ కాలానికి చెందిన వేటగాళ్లు తమ పెంపుడు అడవి పందులకోసం వ్యవసాయదారులవద్దనున్న మరో రకానికి చెందిన పందుల మాంసాన్ని ఆహారంగా తీసుకెళ్లేవారని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది.

జర్మనీకి చెందిన కియెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో క్రీ.పూ.5,500-4,200 సంవత్సరాల ప్రాంతంలో మధ్య ఐరోపా మీదుగా ప్రవహించే ఎల్బే నదీ పరివాహక ప్రాంతాల్లోని దేశీయ వేటగాళ్లు సంచరిస్తూ జీవించేవారట. వారు తమ పెంపుడు అడవి పందులకోసం తొలిసారిగా వ్యవసాయదారులతో వాణిజ్యం నెరపినట్టు పరిశోధకుల పరిశోధనలో తేలింది. టర్కీ, సిరియా, ఇరాక్‌ తదితర ప్రాంతాలనుండి వలస వచ్చినవారు అక్కడి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ, పశు సంపదను పెంచుకుంటూ స్థిర నివాసం ఏర్పరచుకుని బతికేవారట. కొన్నాళ్లకు ఈ వ్యవసాయదారులు, దేశీయ వేటగాళ్లు ఒకరికి ఒకరు తారసపడడం జరిగింది. దీంతో రెండు జాతుల మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత కాలంలో దేశీయ వేటగాళ్లు తాము పెంచుకునే ఊదారంగు అడవి పందుల ఆహారం కోసం వలస వారివద్ద విరివిగా లభించే లేతరంగు పందుల మాంసాన్ని తీసుకుని వెళ్లేవారట. ఇలా వారి వాణిజ్య సంబంధాలు కుండలు, గొడ్డళ్లు వంటి ఇతర వస్తువులకు కూడా విస్తరించినట్టు ఈ తాజా అధ్యయనంలో తేలింది. సులభంగా మాంసం దొరుకుతున్నా వందల సంవత్సరాలపాటు వేటగాళ్ల జీవనశైలిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని పరిశోధకులు తెలిపారు. దాదాపు 500 సంవత్సరాల తర్వాత వారు కూడా వ్యవసాయంపై మొగ్గు చూపినట్టు పరిశోధకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News