: నిరాశను ఇలా దూరం చేసుకోండి!
మీరు నిరాశా నిస్పృహలకు లోనై ఉన్నారా... అయితే ఈ వార్త మీకోసమే. మీలోని నిరాశను దూరం చేసుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని పరిశోధకులు గుర్తించారు. అదేమంటే రోజుకు రెండు కివీ పండ్లను తినడమే. దీంతో మీలోని నిరాశ దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
న్యూజిలాండ్‌లోని ఓటాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో కివీ పండ్లు మనలోని నిరాశను దూరం చేయడంలో చక్కగా ఉపయోగపడతాయని తేలింది. ప్రతిరోజూ మన ఆహారంలో రెండు కివీ పండ్లను చేర్చుకుంటే మనం నిరాశను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. వీరు నిర్వహించిన అధ్యయనంలో రోజుకు రెండు కివీ పండ్లను తినేవారిలో అలసట, కుంగుబాటు వంటి సమస్యలు తక్కువగా ఉంటున్నాయని గుర్తించారు. ఈ పండ్లలో పుష్కలంగా సి విటమిన్ ఉండడం వల్ల ఈ మార్పు కనిపించడానికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.