: చంద్రుడిపై నీళ్లు ఉన్నాయట!
చందమామపైన నీటి జాడలను ఉపగ్రహం ద్వారా గుర్తించినట్టు నాసా ప్రకటించింది. అయితే ఇదంతా భారత్ చేపట్టిన చంద్రయాన్-1 అందించిన సమాచారం ఆధారంగా జరగడం విశేషం. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడిపై పరిశోధనలకోసం చంద్రయాన్-1 యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో చంద్రయాన్-1 మిషన్ అంతరిక్ష నౌకలోని ఎం3 అనే పరికరంలో చంద్రుడికి సంబంధించి నిక్షిప్తమైన సమాచారం ద్వారా అక్కడ నీటి జాడలు ఉన్నట్టు గుర్తించామని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. పరిశోధనకు సంబంధించిన ఫలితాలను 'నేచర్ జియోసైన్స్ జర్నల్'లో ప్రచురించారు. ఈ విధంగా చంద్రుడిపై నీటి ఉనికిని గుర్తించడం ఇదే ప్రధమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.