: ఔటర్ రింగ్ రోడ్ లో మాజీ ఎంపీ, మాజీ మంత్రి కార్లపై దుండగుల కాల్పులు
ఔటర్ రింగ్ రోడ్ లో మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్లపై దుండగులు కాల్పులు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోని కొల్లూరు వద్ద ఈ ఘటన జరిగింది. డివైడర్ చెట్ల మధ్యలో నుంచి దుండగులు కాల్పులు జరిపారు. ముందుగా తుమ్మల కారుపై కాల్పులు జరుపగా ఆయన కారు వెనుక అద్దం పగిలింది. అయితే తుమ్మల ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. పగిలిన అద్దం ముక్కలు గుచ్చు కోవడంతో ఆయన కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయినట్టు తెలుస్తోంది.
తరువాత అదే దారిలో వెళుతున్న మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి కారుపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. మాణిక్ రెడ్డి కూడా సురక్షితంగా బయట పడ్డారు. జోగిపేట నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు ను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫొన్లో పరామర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియాతో ఫొన్లో మాట్లాడుతూ తను సురక్షితంగా ఉన్నానని ,ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.