: కళ్ళకు గంతలు కట్టి అత్యాచారం చేశారు!
కాస్ట్ సర్టిఫికేట్ కోసం వచ్చిన ఓ మహిళ (30)ను మరో మహిళ వంచించి నలుగురు పురుషులకు విందు చేసింది. యూపీలోని కల్యాణ్ నగర్లో జరిగిందీ ఘాతుకం. బాధిత మహిళ స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో వారం కిందట కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. ఓ రోజు సర్టిఫికెట్ కోసం రాగా అక్కడ లలిత అనే మహిళ పరిచయమైంది. రూ.500 తీసుకుని తాను చెప్పిన చోటుకు వస్తే సులువుగా సర్టిఫికెట్ ఇప్పిస్తానని లలిత నమ్మబలికింది. దీంతో, బాధితురాలు ఆ వంచకి చెప్పినట్టే కల్యాణ్ నగర్ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్ళింది.
అక్కడ ఓ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) తో లలిత సిద్ధంగా ఉంది. ఆ వాహనంలో అప్పటికే నలుగురు పురుషులున్నారు. బాధిత మహిళ అక్కడికి రాగానే, అందులోకి ఎక్కమని లలిత సూచించింది. ఆమె అందులోకి ఎక్కగానే, దారుణ అత్యాచార కాండ మొదలైంది. తొలుత ఆమె నోటిలో గుడ్డలు కుక్కి, తర్వాత కళ్ళకు గంతలుకట్టి వంతులవారీగా అత్యాచారం చేశారా కామాంధులు.
ఇక అర్థరాత్రివేళకు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. ఉదయం స్థానికులు చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కల్యాణ్ పూర్ ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.