: బెజవాడలో అనుమానస్పద వ్యక్తుల సంచారం
బెజవాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఓ తపంచా, ఐదు బుల్లెట్లు లభ్యమయ్యాయి. నగరంలోని వించిపేట నైజాం గేటు వద్ద వారు తచ్చాడుతుండడంతో టూటౌన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు 'తమదైన శైలి'లో వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.