: చంచల్ గూడ బయట నేనూ దీక్ష చేస్తా: శంకర్రావు
సమైక్యాంధ్ర కోసం జైలులో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దీక్షకు నిరసనగా తాను వారం రోజుల్లో చంచల్ గూడ జైలు బయట దీక్షకు దిగుతానన్నారు. జైలులో ఉండి దీక్ష చేయడం ఏంటన్న ఆయన, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ దీక్ష వెనుక ఎవరున్నారో సీబీఐచే విచారణ జరిపించాలని శంకర్రావు డిమాండు చేశారు. మానవతాదృక్పథంతో జగన్ కు బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్ ఇవ్వకపోతే న్యాయస్థానంలో తానే పిల్ దాఖలు చేస్తానన్నారు.