: కోర్టు ఎదుటకు గోకుల్ చాట్ పేలుళ్ళ నిందితులు
గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో 2007 ఆగస్టు 25న జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురు నిందితులను హైదరాబాదు నాంపల్లి కోర్టులో ముంబయి పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ వారిని విచారించనున్నారు. అనిఖ్ సఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్ షా షేక్, సాదిక్ షేక్, షారుక్ లను కోర్టు ముందు హాజరుపరిచారు. వీరికి హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.