: వైఎస్ బతికుంటే విభజన జరిగేది కాదని ప్రధాని అన్నారు: విజయమ్మ
రాష్ట్ర విభజనపై కేంద్రానికి విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు విజయమ్మ, మేకపాటి, ఇతర నేతలు ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా విభజన వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే విభజన జరిగేది కాదని ప్రధాని మన్మోహన్ అన్నట్లు విజయమ్మ మీడియాకు తెలిపారు. విభజిస్తే ఉభయ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. కాబట్టి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.