: క్రీడాకారిణిని ఏడిపించిన మీడియా ప్రతినిధులు


టాప్ ఆర్చర్ దీపికా కుమారి కన్నీటి పర్యంతమైంది. పోలెండ్ లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ లో దక్షిణ కొరియాపై గెలిచి భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఈ జట్టుకు దీపికానే కెప్టెన్. మ్యాచ్ గెలిచిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వాలని జాతీయ మీడియా ప్రతినిధులు ఒత్తిడి చేశారు. చాలామంది మీడియా వారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వాలని తనను సంప్రదించారని చెప్పింది. అయితే, తనకు ఏకాంతం కావాలని, తాను బాగా అలసి పోవడంతో ఇవ్వలేనని చెప్పింది.

అయినా, వదలకపోవడంతో దీపిక బేలగా విలపించింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఉదయమే భారత్ కు తిరిగివచ్చిన ఆర్చరీ జట్టును 'ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' కార్యాలయంలో అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా సన్మానించారు. ఆ వెంటనే కార్యాలయం బయట ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News