: పోలీసుల అదుపులో నాగం
బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డిని హైదరాబాదు విద్యుత్ సౌధలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు నాగం విద్యుత్ సౌధకు వెళ్లారు. నిషేధాజ్ఞలు అమలులో ఉండడంతో ఆయనను పోలీసులు అనుమతించలేదు. దీంతో వాగ్వాదానికి దిగిన నాగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల నిరసనలతో విద్యుత్ సౌధలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సంఘీభావం తెలపాలనుకుంటే కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, వీరి సందర్శనల వల్ల వివాదాలు చెలరేగే అవకాశం ఉందని, అందుకే అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.