: ఆశారామ్ బాపూని ఉరి తీయాలి: గురుదాస్ దాస్ గుప్తా
తనను తాను భగవంతుడిగా ప్రకటించుకున్న ఆశారామ్ బాపుపై సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా తీవ్రంగా మండిపడ్డారు. 16 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ వస్తున్న ఆరోపణలపై అతనిని కచ్చితంగా ఉరి తీయాలని డిమాండు చేశారు. ఆశారామ్ చేసిన పని అమానుషం అన్నారు. ఈ ఘటన తనకు చాలా అవమానకరంగా అనిపించిందన్నారు. ఇంత జరిగినా గుజరాత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.