: కిరణ్ ను అదుపు చేస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయి: కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాజా పరిస్థితులు కిరణ్ వల్లే ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. ఆయనను కలిసినంతనే ఏపీఎన్జీవోలు సమైక్యనినాదం అందుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏపీఎన్జీవోలు కిరణ్ అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడిచేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రావాలంటే, కిరణ్ ను దిగ్విజయ్ అదుపు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News