: బంగారు, వెండి పేకముక్కలతో గుజరాతీల పసందైన ఆట


ఏ ఇంట చూసినా పేకముక్క పకపకా నవ్వాల్సిందే! పెద్దోళ్ల నుంచి యువకుల వరకు పేకాట అలవాటు, బలహీనత, సరదాగా మారిపోయింది! గుజరాత్ లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పేకాట పెద్ద ఎత్తున నడుస్తుంది. రమ్మీ, తీన్ పట్టి ఆటలు పండగ ముందు నుంచి పండగ నాటి వరకు ఆడడం అక్కడి వారికి సర్వసాధారణం. కానీ, ఈసారి అక్కడ సాధారణ పేకముక్కలకు బదులుగా బంగారు, వెండి పూతపూసిన పేకముక్కలు కళకళలాడుతున్నాయి. గత కొన్ని రోజుల్లోనే 2,000 బంగారం, వెండి పేక ముక్కల సెట్లు అమ్ముడయ్యాయని వర్తకులు చెబుతున్నారు. వీటి ధరలు 1000 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు ఉన్నాయి. సంపన్నులైతే, తైవాన్, హాంగ్ కాంగ్, సింగపూర్, మలేసియా దేశాల నుంచి మరీ తెప్పించుకుంటున్నారు. లక్ష రూపాయల పైన పందేలు కాసుకునే వారు వీటిని వాడడానికి ఇష్టం చూపుతున్నారని వర్తకులు చెబుతున్నారు. జన్మాష్టమితో సంబంధం లేకుండా బంగారం, వెండి పేక ముక్కలను బహుమతులుగా ఇచ్చే ఆసక్తి పెరిగిపోతోందని అహ్మదాబాద్ జ్యుయెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శాంతి పటేల్ తెలిపారు.

  • Loading...

More Telugu News