: రాహుల్ కోసమే విభజన.. దీని వెనుక ఇటలీ మాఫియా హస్తం: గోరంట్ల
రాష్ట్ర విభజన నిర్ణయం వెనుక ఇటలీ మాఫియా కుట్ర ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో జలవివాదాలు పుష్కలంగా ఉన్నాయని, జిల్లాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని, రైతుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని గుర్తు చేశారు. విభజన జరిగితే అగ్నికి ఆజ్యం పోసినట్టవుతుందని ఆయన పేర్కొన్నారు. విభజనను సహించేది లేదన్న గోరంట్ల.. బొత్స అధిష్ఠానం ముందు తల ఊపి వచ్చేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎంపీ బొత్స ఝూన్సీ లకు విభజన విషయం తెలిసినా ఎందుకు మౌనం వహించారో ప్రజలకు బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు.