: నటుడు ఓంపురి పరారీ


బాలీవుడ్ నటుడు ఓంపురి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళితే.. ఆయనపై గృహహింస కేసు నమోదైంది. వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆయన రెండవ భార్య నందిత ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఓంపురి కర్రతో తనను కొట్టాడని, హింసించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. దాంతో, ప్రమాదకర ఆయుధాన్ని ఉపయోగించి కొట్టడం లేదా మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, అవమానించడం వంటి కారణాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు ఇన్ స్పెక్టర్ హరీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు పోలీసులు అరెస్టు చేసేందుకు గత శుక్రవారం ఓంపురి నివాసానికి వెళ్లగా ఆయన ఆచూకీ తెలియరాలేదు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News