: నవజ్యోత్ సింగ్ సిద్ధూను తీసుకొస్తే.. 2లక్షల రివార్డు
అమృత్ సర్ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనిపించడం లేదట! అతడిని ఎవరైనా నియోజకవర్గానికి తీసుకొస్తే 2 లక్షల నజరానా ఇస్తామంటూ ఒక స్వచ్ఛంద సంస్థ అమృత్ సర్ పట్టణంలో పోస్టర్లు అంటించింది. చాలా కాలంగా సిద్ధూ తన నియోజకవర్గం వైపు తొంగి చూడకపోవడంతో 'అమృత్ సర్ సంఘర్షణ సమితి' ఈ విధంగా పట్టణంలో పోస్టర్లు అంటించి నిరసన వ్యక్తం చేస్తోంది. 'సిద్ధూ అమృత్ సర్ పట్టణాన్ని పారిస్ లా మార్చేస్తానంటూ హామీలిచ్చాడు. కానీ, విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు' అని పోస్టర్లలో ఆ సంస్థ ప్రముఖంగా పేర్కొంది.