: కొత్తగా 18 విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి: చిదంబరం
దేశంలో కొత్తగా 18 విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆర్ధికశాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. వీటికి రూ.83,772 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాగా, ప్రాజెక్టులకు బ్యాంకులు రూ.30వేల కోట్ల రుణాలు మంజూరు చేశాయని వెల్లడించారు. అటు రూ.92,541 కోట్లతో చేపట్టే 9 మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు చిదంబరం. సెప్టెంబర్ 6 నాటికి 18 ప్రాజెక్టులకు ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 31 నాటికి ఇంధన ఒప్పందాలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.