: కొత్త సర్పంచ్ లకు నోటీసులు ఇవ్వనున్న ఐటీ


రాష్ట్రంలో కొత్తగా ఎన్నికయిన సర్పంచ్ లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. కొద్దివారాల క్రితం జరిగిన ఎన్నికల్లో నిధులకు సంబంధించిన లావాదేవీలపై వారిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు 250 మందికి పైగా సర్పంచ్ లకు నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి ఐటీ అధికారులు వివరాలు కూడా అడిగారట. అంతేకాక సర్పంచ్ ల బ్యాంక్ లావాదేవీలపై కూడా ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. ఆదాయ పన్ను జాబితాలో ఉన్న 180 మంది సర్పంచ్ లు తమ ఎన్నిక కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని, ఈ సొమ్ముకు ఆదాయ పన్ను చెల్లించారా? లేదా? వంటి వివరాలను తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News