: మంత్రి గీతారెడ్డికి సీబీఐ నోటీసులు
మంత్రి గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. నేడు, రేపు విచారణకు అందుబాటులో ఉండాలని ఆమెను ఆదేశించింది. లేపాక్షి నాలెడ్జ్ భూ కేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని ఆమె నివాసంలోనే ప్రశ్నించనున్నారు. వైఎస్ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. ఆ సమయంలోనే లేపాక్షికి భూ కేటాయింపులు జరిగాయి. సెప్టెంబర్ మొదటి వారంలోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయవలసి ఉండటంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీమంత్రి ధర్మానను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. దాంతో, వరుసగా ఒక్కొక్క మంత్రిని విచారిస్తోంది.