: బాబూ...మాట జాగ్రత్త: మంత్రి బాలరాజు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం అదుపు తప్పి మాట్లాడుతున్నారని మంత్రి బాలరాజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని చంపాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పదవి ఉన్నప్పుడు ఒకలాగా, లేకుంటే మరోలా మాట్లాడటం.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు తగదని బాలరాజు హితవు చెప్పారు.