: అత్యాచారాలపై సర్వోన్నత న్యాయస్థానం దిగ్భ్రాంతి


మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది? 90 శాతం కేసుల్లో నేరం నిరూపితం కాక, నిందితులు నిర్దోషులుగా బయటపడడం ఎందుకు జరుగుతోంది? పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి.. అన్నట్టు ఎలా మారుతోంది? అని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానాలో జరిగిన ఓ సామూహిక అత్యాచార కేసు విచారణ సందర్భంగా ముంబై ఘటన కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో అత్యాచార నేరాలే మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయని న్యాయమూర్తులు ప్రశ్నించారు. హర్యానా కేసుకు సంబంధించి బాధితురాలి తండ్రి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను న్యాయస్థానం ముందు ఏకరువుపెట్టారు. అదంతా విన్న న్యాయస్థానం బాధితుల పునరావాసానికి సంబంధించి ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

  • Loading...

More Telugu News