: శరద్ యాదవ్ తో అశోక్ బాబు భేటీ


జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు సమావేశమయ్యారు. యాదవ్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచేందుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధానిని కలిగి ఉన్న ప్రాంతీయుల డిమాండ్, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీరుతెన్నులు వివరించినట్టు తెలిపారు. రాజకీయ నాయకుల అసమర్థతే తమ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమని, రాజకీయ ప్రయోజనాల వల్లే రాష్ట్ర విభజనకు మొగ్గు చూపారని అన్నారు. తమ వాదన విన్న శరద్ యాదవ్ సమైక్యాంధ్రకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని అశోక్ బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News