: భారత విమానాశ్రయాలకు 'బ్రెస్ట్' బాంబు ముప్పు


ఉగ్రవాదులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. విధ్వంసాలకు పాల్పడే క్రమంలో తనిఖీలకు చిక్కకుండా ఉండేందుకు పకడ్బందీ 'ఎత్తు'గడలతో రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే సుప్రసిద్ధ లండన్ హీత్రూ ఎయిర్ పోర్టుకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పు పొంచి ఉందని, ప్రధానంగా మహిళా ఆత్మాహుతి దళాలు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లో పేలుడు పదార్థాలను నింపుకుని విధ్వంసానికి తెరదీయనున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో, అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనిఖీ ఏర్పాట్లు అంత కట్టుదిట్టంగా ఉండని భారత విమానాశ్రయాలకూ ఈ బ్రెస్ట్ బాంబుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలంటున్నాయి.

మన విమానాశ్రయాల్లో పూర్తిస్థాయిలో శరీరాన్ని జల్లెడపట్టే స్కానర్లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మహిళలను తనిఖీ చేయడం కత్తిమీద సామేనని సీఐఎస్ఎఫ్ అధికారులంటున్నారు. సున్నితమైన వ్యవహారం కావడంతో ఇందుకోసం మహిళా సిబ్బందిని నియమిస్తామని సీఐఎస్ఎఫ్ ఎస్ డీజీ (ఎయిర్ పోర్ట్స్) ఆర్ఆర్ వర్మ తెలిపారు. ఇక బ్రెస్ట్ బాంబులను గుర్తించేందుకు తాము ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News